కేంద్ర బడ్జెట్ 2026-27: విద్యా రంగం, వేతన జీవుల ఆశలు నెరవేరలేదు -టిఆర్టిఎఫ్.

నవగీతం,జగిత్యాల: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ విద్యా రంగం మరియు మధ్యతరగతి వేతన జీవుల ఆశలను ప్రతిబింబించలేకపోయిందని తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బేతి సాయికృష్ణ అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానానికి, విదేశీ పెట్టుబడులకు బడ్జెట్‌లో పెద్దపీట వేయడం శుభపరిణామమే అయినప్పటికీ, దేశ భవిష్యత్తుకు పునాదులైన ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి మరియు నిరంతరం పన్నులు చెల్లించే ఉద్యోగుల సంక్షేమానికి తగిన ప్రాధాన్యత లభించకపోవడం  నిరాశ కలిగించిందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఏఐ (AI), డిజిటల్ విజ్ఞాన కేంద్రాల...