కేసీఆర్ పై ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్య..ఎమ్మెల్యే సంజయ్

నవగీతం,మెట్ పల్లి: కోరుట్ల పట్టణంలో ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్, బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ ని సిట్ విచారణకు పిలవడం అనేది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్య అని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన కేసీఆర్ ప్రజాదరణను తట్టుకోలేకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిరంకుశ, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్...