navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 3:11 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కొడిమ్యాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

నవగీతం,కొడిమ్యాల:

కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం ఉదయం 10 గంటలకు సీఎం కప్ 2025–26 మండల స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ఇ. స్వరూప, స్థానిక సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డితో ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని క్రీడాకారులు పల్లె స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగేందుకు ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తోందని తెలిపారు. మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం వాలీబాల్, కబడ్డీ, కో-కో క్రీడాకారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఇ. స్వరూప్, సర్పంచ్ జీవన్ రెడ్డి, ఏఎంసీ మల్యాల వైస్ చైర్మన్ కొండూరు రాజేష్, ఉపసర్పంచ్ గుర్రం నరసయ్య గౌడ్, వార్డు సభ్యులు శ్రీజ, శ్రీనివాస్, మండల విద్యాధికారి ఐత శ్రీనివాస్, మండల ఎస్‌జీఎఫ్ కార్యదర్శి బూట్ల రాజమల్లయ్య, ప్రధానోపాధ్యాయురాలు ఆచి విజయేంద్ర, ఫిజికల్ డైరెక్టర్లు బీరయ్య, శివకృష్ణ, అనూప్ రెడ్డి, మల్లయ్య, హబీబ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.ఈ పోటీల్లో వాలీబాల్ (18 ఏళ్ల లోపు బాలబాలికలు), కో-కో (14 నుంచి 20 ఏళ్ల లోపు బాలబాలికలు), కబడ్డీ (పురుషులు, మహిళలు), అథ్లెటిక్స్ (వివిధ విభాగాల్లో పరుగు పందాలు) నిర్వహిస్తున్నారు.హిమాత్రావు పేట, నాచుపెల్లి, పూడూర్, రామకృష్ణాపూర్, కొడిమ్యాల, సూరంపేట, చెప్యాల, తిరుమలాపూర్, నమిలకొండ క్లస్టర్ల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.