కొడిమ్యాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
నవగీతం,కొడిమ్యాల: కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం ఉదయం 10 గంటలకు సీఎం కప్ 2025–26 మండల స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ఇ. స్వరూప, స్థానిక సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డితో ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని క్రీడాకారులు పల్లె స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగేందుకు ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తోందని తెలిపారు. మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు...