11 గంటల వరకు 24.03 ఓటింగ్ శాతం నమోదు
నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో భాగంగా బుధవారం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 11 గంటల వరకు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 24.03 శాతం ఓటింగ్ నమోదయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మున్సిపల్ లో ఉదయం 11 గంటల వరకు 26.28 శాతం, జగిత్యాల మున్సిపల్ లో 23.81శాతం, కోరుట్ల మున్సిపల్ లో 22.91 శాతం, మెట్ పల్లి మున్సిపల్ లో 24.51 శాతం, రాయికల్ మున్సిపల్ పరిధిలో 26.93 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.