నవగీతం, కోరుట్ల:
కోరుట్ల పట్టణంలోని ప్రాథమిక పాఠశాల యస్ ఆర్ యస్ పి క్యాంప్ గడి కల్లూరు రోడ్ కోరుట్లలో మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్ కి ఘన సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.ఈ వేడుకలో పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మంగ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని, విద్యార్థుల భవిష్యత్‌కు ఉపయోగపడే విధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

పాఠశాల తరుపున ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు,కమిటీ చైర్మన్ మంగ, ఉపాధ్యాయులు అబ్దుల్ రవూఫ్, పూర్ణ చందర్, రాజకుమార్, ధన లక్ష్మి, సుమలత, సరస్వతి, భవాని విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.