గ్రామశివారులో 600 ఏళ్ల పురాతన శివలింగం

శివరాత్రి పండగ ప్రత్యేక పూజలు నవగీతం,కొడిమ్యాల కోడిమ్యాల మండలం రామకిష్టాపురం గ్రామ శివారులోని ప్రశాంతమైన మామిడి తోటలో కొలువై ఉన్న 600 ఏళ్ల నాటి పురాతన శివలింగం భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది.ప్రకృతి ఒడిలో నిశ్శబ్దంగా వెలసిన ఈ దివ్య స్థలం భక్తి, చరిత్ర, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది.స్థానిక పెద్దల వాక్యానుసారం, ఈ శివలింగం సుమారు ఆరు శతాబ్దాల క్రితం నాటిదని విశ్వసిస్తున్నారు.పూర్వంలో ఇక్కడ ఒక పురాతన ఆలయం ఉండేదని, కాలక్రమేణా అది కనుమరుగైందని చెబుతున్నారు.ప్రస్తుతం ప్రకృతి సోయగాల మధ్య వెలసిన ఈ...