నవగీతం ,మల్లాపూర్:
మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మండల వైద్యాధికారిణి వాహిని శాలువాలతో ఘనంగా సన్మానించినారు.ఇటీవలే ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ గా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న దాసరి ఉమా దేవి, ఎల్.సుమలత ని పాలకవర్గం అభినందించారు. ఈ కార్యక్రమం లో మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామ్ మోహన్, సూపెర్వైజర్లు శకుంతల, టీ.విజయ, ఫార్మసిస్ట్ ఆఫీసర్ మహేశ్వరి, నర్సింగ్ ఆఫీసర్స్ సుమ, మధులత, ఏ.ఎన్.ఎం అంజలి, ఆశా వర్కర్లు ముద్దం సరిత, ముద్దం శిరీష, సబ్బని ప్రేమలత, ముక్కెర రమ, ఆకుతోట లీలా రాణి, ఆకుతోట లావణ్య, వార్డు సభ్యులు కొంపెల్లి రాకేష్, ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.