నవగీతం, కొడిమ్యాల:
కొడిమ్యాల మండల కేంద్రంలోని విజ్‌డమ్ విద్యాభారతి విద్యాసంస్థల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైన్స్‌కు సంబంధించిన వివిధ రకాల ప్రదర్శనలు, శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించి తమ ప్రతిభను చాటుకున్నారు.సైన్స్ డే పురస్కరించుకొని ప్రముఖ శాస్త్రవేత్త సి . వి . రామన్ గురించి విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. ఆయన పూర్తి పేరు చంద్రశేఖర వెంకట రామన్.తమిళనాడులో జన్మించిన ఆయన తల్లిదండ్రులు చంద్రశేఖర అయ్యర్, పార్వతీ అమ్మాల్. కృషి, పట్టుదలతో శాస్త్ర రంగంలో విశిష్ట స్థానం సంపాదించిన ఆయనకు 1930లో నోబెల్ బహుమతి లభించిందని తెలిపారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని విద్యార్థులకు ఉపాధ్యాయులు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు యాజమాన్య సభ్యులు పాల్గొన్నారు.