ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పట్నాలు
బోనాల పండుగ వైభవం నవగీతం, కొడిమ్యాల కొడిమ్యాల మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పట్నాలు, బోనాల పండుగ, కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడగా, మండలం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి, ఎమ్మెల్యేలకు కొడిమ్యాల...