నవగీతం,మల్లాపూర్:
మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో శుక్రవారం రోజున విడిసి మరియు దేవాదాయ కమిటి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామి వారి కల్యాణం భక్తుల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపిసిసి డెలిగెడ్ సభ్యులు కల్వకుంట్ల సుజిత్ రావు హాజరై స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు.కల్యాణ మహోత్సవం అనంతరం భక్తుల కోసం మహా అన్నదానం నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.