navageetam.com
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 6:23 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు

బోగ్ భండార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

బంజారా సమాజ ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు జగిత్యాలలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మహారాజ్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారని, సమాజంలో ఐక్యత, సేవా భావం, నైతిక విలువలను పెంపొందించేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత మహారాజ్ బోధనలు ఆచరించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

శాసన సభ్యులు బంజారా భవన్ కు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నాను అని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ వాణి శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య,జిల్లా జిల్లా విద్యాధికారి కె రాము,ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్ కుమార్ ,స్పెషల్ ఆఫీసర్ మదన్మోహన్, ఎంపిడిఓ, తహసీల్దార్, ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ ఏ ఐ బి యస్ ఎస్ జిల్లా అధ్యక్షులు భూక్యా గోవింద్ నాయక్,ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్

తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం టి జి యు యస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, ప్రధాన కార్యదర్శి జరుపుల గోవింద్,జవహర్ లాల్ నాయక్,గోపాల్ నాయక్ ,మురళి, ప్రవీణ్,లక్ష్మణ్ నాయక్,సురేందర్ నాయక్,ప్రకాష్ నాయక్ అన్ని తండాల్లో ఉన్న సర్పంచ్, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, బంజారా సమాజ పెద్దలు, యువకులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు నిర్వహించి మహారాజ్ జయంతిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.