navageetam.com
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 11:39 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఘనంగా సిరిపురం యాదయ్య వర్ధంతి వేడుకలు

నవగీతం, హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిధానము చేసుకున్న  ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్‌సిసి ప్రాంగనమున సిరిపురం యాదయ్య స్మారక సమితి అధ్వర్యములో, వ్యవస్థాపక అధ్యక్షుడు కీర్తిశేషులు డాక్టర్ తాటికొండ వెంకట్రాజయ్యగారి ని  స్మరించుకుంటు సర్దార్ సిరిపురం యాదయ్య 16 వర్ధంతి కార్యక్రమము నిర్వహించారు.ఈ యొక్క కార్యక్రమంలో కన్వీనర్ సిరిపురం ఉపేందర్ కో కన్వీనర్స్ పగిడిమర్రి హరి , శంకర్  నర్సింగా రావు , సలహాదారులు దుడుకు గోవర్ధన్ డాక్టర్ పుట్టా పాండురంగయ్య,జక్కుల కృష్ణ, డాక్టర్ జి. హరి చరణ్ , సభ్యులు సిరిపురం ఆనంద్ కుమార్ భోగ జగదీష్ , సమ్మెట ప్రశాంత్ , కిరణ్ కుమార్ రెడ్డి  వడ్డేపల్లి శ్రీధర్, గోవర్ధన్ రెడ్డి , కైరంకొండ శ్రీకాంత ,ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ , బిజెపి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్,  బాగ్ అంబర్పేట కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి, నల్లకుంట కార్పొరేటర్  వై అమృత , బిసి కమిషన్  మాజీ ఛైర్మన్ బిఎస్ రాములు గారు, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలీ సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ , ఆరుట్ల సురేష్ కుమార్, కైరంకొండ గట్టయ్య  మరియు వారి సంఘం సభ్యులు పాల్గొన్నారు.