navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 6:35 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

చిన్నారి జ్ఞాపకాలకు కన్నీటి నివాళి –

గురువుల నుంచి ఆర్థిక చేయూత

నవగీతం, మల్లాపూర్

మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో ఇటీవల జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన 6వ తరగతి విద్యార్థిని రోడ్డ వైష్ణవి మృతితో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయిన విషయం విదితమే. చిన్నారి అకస్మాత్తు మృతి పాఠశాల వాతావరణాన్నే కమ్మేసింది.తను చదువుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాల ఉపాధ్యాయ బృందం ఈ విషాదాన్ని తట్టుకోలేక, తమవంతు బాధ్యతగా ముందుకు వచ్చారు. ఉపాధ్యాయులందరు స్వచ్ఛందంగా కలిసి రూ.13,150/-ను సేకరించి వైష్ణవి కుటుంబ సభ్యులకు శనివారం రోజున అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ వైష్ణవి చదువులో చురుకుగా ఉండేది. ఆమె కోల్పోవడం మాకు వ్యక్తిగత నష్టమే అంటూ చిన్నారి జ్ఞాపకాలకు కన్నీటి నివాళి అర్పించారు. కుటుంబానికి ఎంతటి ఆర్థిక సహాయం చేసినా ఆమెను తిరిగి తీసుకురాలేము కానీ ఈ చిన్న సహాయం వారికి కొంత ఊరట కలిగించాలని ఆశిస్తున్నాం అని తెలిపారు. సహాయం అందజేసే వేళ హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. చిన్నారి జ్ఞాపకాలు స్మరించుకుంటూ ఉపాధ్యాయులు,తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.ఈ ఘటనలో ప్రభుత్వ సహాయం కోసం కుటుంబీకులు ఇంకా ఎదురు చూస్తుండగా పాఠశాల ఉపాధ్యాయుల మానవత్వం మాత్రం గ్రామంలో ప్రశంసలు అందుకుంటోంది. చిన్నారి కలలు ఆగిపోయినా ఆమెకు గురువుల అండ మాత్రం నిలిచింది. అక్కడికి వెళ్లిన వారిలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మన్న ఉపాధ్యాయులు లింగన్న, రాధ, విజయ,ఇమ్రాన్, కన్నయ్య,జ్యోతి రాణి, సుమలత, సంతోష, కవిత తో పాటు గ్రామ సర్పంచ్ గోల్కొండ కళ రమేష్, విద్యార్థులు ఉన్నారు.