నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రఘు
నవగీతం, మెట్ పల్లి:
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీ (తిప్పిరి తిరుపతి) అడవి బాటను వదిలి జనజీవన స్రవంతిలోకి కలిసిపోవడానికి ముందుకు రావడం సంతోషదాయకమని నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రఘు పేర్కొన్నారు. మావోయిస్టు అగ్రనేత లొంగుబాటును స్వాగతిస్తూ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముందు చూపును అభినందిస్తూ మంగళవారం నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రఘు హర్షం వ్యక్తం చేశారు. 2019 నుంచి మావోయిస్టు పార్టీని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుండగా ప్రస్తుతం చివరి దశకు చేరుకొని అగ్రనేతలను జనజీవన స్రవంతిలోకి కలిసేందుకు కృషి చేసిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.