జాతీయ సైన్స్ దినోత్సవం నేపథ్యంలో విద్యార్థులకు పోటీలు
నవగీతం, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ పురస్కరించుకొని విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు తిరుపతి తెలిపారు. శనివారం పాఠశాలలో జాతీయ సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన పోటీలలో ఉత్తమ పతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. మానాల పాఠశాలల చెందిన విద్యార్థులు ఈ ప్రతిభ పోటీలలో పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి బహుమతి డి.లాస్యప్రియ, ద్వితీయ బహుమతి బి. సాహిత్, తృతీయ బహుమతి బి. అయాన్...