9 గంటల వరకు 12.04 ఓటింగ్ శాతం నమోదు
నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో భాగంగా బుధవారం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 12.04 శాతం ఓటింగ్ నమోదయింది. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మున్సిపల్ లో మొత్తం 15 వార్డులు ఉండగా ఇక్కడ ఉదయం 9 గంటల వరకు 16.40 శాతం, జగిత్యాల మున్సిపల్ లో 50 వార్డులు ఉండగా 14.23 శాతం, కోరుట్ల మున్సిపల్ లో 33 వార్డులు ఉండగా 10.38 శాతం, మెట్ పల్లి మున్సిపల్ లో 26 వార్డులు ఉండగా 10.30 శాతం, రాయికల్ మున్సిపల్ పరిధిలో 12 వార్డులు ఉండగా 12.04 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.