ట్రాక్టర్ ప్రమాదం.. మొగిలిపేట కన్నీటి సముద్రం

నలుగురి మృతి – శోకసంద్రంలో ముగిసిన అంత్యక్రియలు నవగీతం,మల్లాపూర్: మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో మంగళవారం జరిగిన ఘోర ట్రాక్టర్ ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన గ్రామాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ, న్యాయం జరిగే వరకూ తమ నిరసన కొనసాగిస్తామని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. చివరికి పోలీసుల హామీతో ఆందోళన విరమించడంతో, మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో...