ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మృతి

గ్రామంలో విషాద ఛాయలు నవగీతం, మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పసుపు పంట కోయడాని వెళ్లిన మహిళలు పని ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్ లో సుమారు 8 మంది మహిళలు ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాసేపటి క్రితం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....