కోరుట్లలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
రోడ్డు ప్రమాదాల నివారణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని పోలీస్ శాఖ చేపట్టిన “అరైవ్ ఆలైవ్” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ వాహనాల డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాలను గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా “Arrive Alive – A Campaign for Safer Roads in Telangana” అనే ప్రత్యేక రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంబించడం జరిగిందని మొదటి ఫేజ్ ని విజయవంతంగా పూర్తి చేసుకొని రెండవ ఫేజ్ ని ఈ ఈ నెల 22 నుంచి 28 వరకు జిల్లా వ్యాప్తంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని ప్రజల్లో అలవాటు చేయడం, గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో బాగంగా శుక్రవారం వాహనాల డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందిని అన్నారు.రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉన్నప్పటికీ, చూపు లోపం కూడా ఒక కారణమని అని ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనాలు నడిపే డ్రైవర్లు, దీర్ఘదూర ప్రయాణాలు చేసే లారీ మరియు బస్సు డ్రైవర్లు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో స్పష్టమైన చూపు లేకపోతే, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్ సైన్ బోర్డులు, ముందున్న వాహనాలు సరిగా కనిపించక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ఎస్పీ హెచ్చరించారు.

అందువల్ల డ్రైవర్లు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా, సమయానుకూలంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరమని తెలిపారు.ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన కంటి వైద్యులు ఆధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించడం జరిగింది. అవసరమైన డ్రైవర్లకు తగిన సూచనలు ఇచ్చి, చూపు సమస్యలు గుర్తించిన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందజేయడంతో పాటు అవసరమైన మందులు కూడా పంపిణీ చేశారు.

అవసరమైతే తదుపరి చికిత్స కోసం సంబంధిత ఆసుపత్రులకు రిఫర్ చేసే ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రాములు కోరుట్ల సీ.ఐ సురేష్, ఎస్.ఐ చిరంజీవి, డాక్టర్ లు సంపత్ కుమార్ ,సుమన్, సమీర్,లయన్స్ క్లబ్ అధ్యక్షులు – జీవన్ రెడ్డి, కార్యదర్శి ,పోలీస్ సిబ్బంది, మరియు 200 మంది డ్రైవర్లు పాల్గొన్నారు.