ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా డ్రైవింగ్ చేయాలి.. జిల్లా ఎస్పి అశోక్ కుమార్
కోరుట్లలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నవగీతం, జగిత్యాల ప్రతినిధి: రోడ్డు ప్రమాదాల నివారణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని పోలీస్ శాఖ చేపట్టిన “అరైవ్ ఆలైవ్” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ వాహనాల డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాలను గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో రాష్ట్ర డిజిపి...