దమ్మయపేట గ్రామ పరిసరాల్లో పెద్దపులి సంచారం

స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నవగీతం, కొడిమ్యాల: కొడిమ్యాల మండలంలో మరోసారి పులి సంచారం కలకలం రేపుతోంది. దమ్మయ్యపేట గ్రామ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి ప్రత్యక్షమవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.స్థానికుల కథనాల ప్రకారం, గ్రామం సమీపంలోని పొలాలు మరియు చెరువుల వైపు పులి సంచరిస్తున్నట్లు గమనించారు.ఈ సమాచారం గ్రామంలో వేగంగా వ్యాపించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రజలు గుంపులుగా చేరి చర్చించుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్‌ఆర్‌ఏ గులాం...