navageetam.com
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 3:45 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందజేత

మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు

నవగీతం,రాజన్న సిరిసిల్ల:

వేములవాడ పట్టణం ముదిరాజ్ వీధికి చెందిన ఉప్పుల ఎల్లయ్య ఇతనికి మగ సంతానం లేదు. భార్య ఒక కూతురు ఉంది. భార్య పేరు చంద్రకళ, కూతురుకు పెళ్లి అయ్యింది. ఉప్పుల ఎల్లయ్య నిన్నటి రోజున సాయంత్రం అనారోగ్యంతో మరణించడంతో దహన సంస్కరాలకు కూడా డబ్బులు లేవని వారి దగ్గర బంధువులు తెలియ జేయడంతో ట్రస్టు మరియు సోషల్ మీడియా గ్రూపులో పోస్టు చేయగా దాతలు గొప్ప మనస్సుతో స్పందించి మానవతా దృక్పథంతో అందించిన విరాళాల రూపంలో వచ్చిన రూ.25 వేలు బాధితుని భార్య చంద్రకళకు 25వేల నగదు అందజేయడం జరిగిందని ఇంకా ఎవరైనా దాతలు విరాళాలు అందించేవారు ట్రస్ట్ ఫోన్ పే గూగుల్ పే నెంబర్ 89855 88060కు అందించినట్లయితే నిరుపేద కుటుంబానికి చెందిన ఉప్పుల ఎల్లయ్య కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగు తుందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తో పాటు డాక్టర్ బెజ్జంకి రవీందర్ మహమ్మద్ అబ్దుల్ రఫీక్ కడారి రాములు రేగుల శేఖర్ పాల్గొన్నారు.