navageetam.com
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 3:05 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నల్గొండ జిల్లాలో సీఎం కప్ ఖో-ఖో పోటీలు

జగిత్యాల జిల్లా జట్టుకు కాంస్య పతకం

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

రాష్ట్ర స్థాయి సీఎం కప్ క్రీడలలో భాగంగా నల్గొండ జిల్లాలో నిర్వహించిన ఖో-ఖో పోటీల్లో జగిత్యాల జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో విజయం సాధించి కాంస్య పతకాన్ని అందుకున్నారు.ఈ జట్టులో జగిత్యాల జిల్లా మల్యాల మండలం గుడిపేట గ్రామానికి చెందిన కుసుమ అశ్విన్ కుమార్ పాల్గొని తన ప్రతిభను చాటుకున్నారు.కుసుమ అశ్విన్ కుమార్ మల్యాల ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఆల్ ఫోర్స్ స్కూల్ లో 9వ తరగతి విద్యార్థిగా చదువుతున్నారు. జిల్లా స్థాయిలో విశిష్ట ప్రదర్శన కనబరిచి పతకం సాధించిన అశ్విన్ కుమార్‌ను ఆల్ ఫోర్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత, చైర్మన్ వి. నరేందర్ రెడ్డి అభినందించారు.అలాగే పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఆయనను ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లా క్రీడాకారుల ఈ విజయం జిల్లా క్రీడాభిమానుల్లో ఆనందం నింపింది.