navageetam.com
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 8:02 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నాగోల్ డివిజన్ నుండి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి భారీ చేరికలు

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

నవగీతం, ఎల్బీనగర్

ఎల్.బి నగర్ నియోజకవర్గం పరిధిలోని నాగోల్ డివిజన్‌కు చెందిన పలువురు సిపిఐ, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు కార్యకర్తలు ఆ పార్టీలకు రాజీనామా చేసి శనివారం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్ల వాసుదేవ్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్తగా చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రజల సమస్యల పరిష్కారం,సామాజిక న్యాయం సాధన, బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. 78ఏండ్ల నుండి రాజ్యాధికార చూడని వర్గాలను సింహాసనం పై కూర్చోబెట్టడమే పార్టీ అంతిమ లక్ష్యం అని మల్లన్న స్పష్టం చేశారు.కొత్తగా చేరిన నాయకులు మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలు తమను ఆకర్షించాయని, నాగోల్ డివిజన్‌లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నరసయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు అంజన్ కుమార్ ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.