నాగోల్ డివిజన్ నుండి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి భారీ చేరికలు

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నవగీతం, ఎల్బీనగర్ ఎల్.బి నగర్ నియోజకవర్గం పరిధిలోని నాగోల్ డివిజన్‌కు చెందిన పలువురు సిపిఐ, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు కార్యకర్తలు ఆ పార్టీలకు రాజీనామా చేసి శనివారం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్ల వాసుదేవ్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్తగా చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా...