నాచుపల్లిలో సర్పంచ్ బొడ్డెల్లి నాగమణికి ఆత్మీయ సన్మానం

నవగీతం,కొడిమ్యాల: కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన సర్పంచ్ బొడ్డెల్లి నాగమణికి గ్రామ యువత ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.జుట్టవేణి పోశాలు, గడ్డం రమేష్ నేతృత్వంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామ అభివృద్ధిపై సర్పంచ్ నాగమణికి ఉన్న అంకితభావాన్ని, ఆమెపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని గౌరవిస్తూ ఈ సన్మానం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ యువత శాలువాలతో కప్పి, పూలమాలలు వేసి సర్పంచ్‌ను...