నూతన చైర్‌పర్సన్‌గా సమీండ్ల వాణి పదవీ బాధ్యతల స్వీకరణ
శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా సమీండ్ల వాణి శ్రీనివాస్ అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై నూతన చైర్‌పర్సన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.మున్సిపల్ కమిషనర్ స్పందన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమీండ్ల వాణి శ్రీనివాస్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి...