నూతన పోస్టల్ ఫ్రాంచైజీల కోసం దరఖాస్తుల ఆహ్వానం
పెద్దపల్లి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.శివాజీ నవగీతం,పెద్దపల్లి: పెద్దపల్లి పోస్టల్ డివిజన్ పరిధిలో సేవలను మరింత చేరువ చేసేందుకు భారత పోస్టల్ శాఖ నూతన ఫ్రాంచైజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.స్పీడ్ పోస్ట్,పార్సెల్ సర్వీస్, అంతర్జాతీయ మెయిల్ బుకింగ్ మరియు డెలివరీ వంటి సేవలను విస్తరించడమే లక్ష్యంగా కొత్త పోస్టల్ ఫ్రాంచైజీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పెద్దపల్లి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తి గల అభ్యర్థులు భారత పోస్టల్ శాఖ అధికారిక వెబ్‌సైట్ indiapost.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనీ తెలిపారు....