navageetam.com
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 3:46 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నూనె గింజల సాగు యాజమాన్యంపై రైతులకు శిక్షణ

నవగీతం,మల్లాపూర్:

వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సౌజన్యంతో వ్యవసాయ శాఖ సంయుక్తంగా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో నూనె గింజ పంటల సాగు యాజమాన్యంపై రైతులకు ఒకరోజు శిక్షణ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల ఏడిఏ దండ రమేష్ మాట్లాడుతూ.. వేసవి కాలంలో సాగు చేయడానికి నువ్వు పంట అనుకూలమైన నూనె గింజల పంట అని తెలిపారు.

దీనికి తక్కువ పెట్టుబడి స్వల్పకాల పరిమితి ఎగుమతి ప్రాధాన్యతం ఉంది. తక్కువ నీటి వనరులు అన్ని రకాల నేలలలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంది. నువ్వు పంటలు అధిక దిగుబడును సాధించడానికి చేపట్టవలసిన ఎరువుల యాజమాన్యం నీటి యాజమాన్యం కలుపునివారణ పురుగులు తెగుళ్ల సస్య రక్షణ గురించి వివరించారు. ఆయిల్ పామ్ సాగు గురించి వివరిస్తూ తోట నాటిన 3 సంవత్సరాల తర్వాత దిగుబడి ప్రారంభమై 30 సంవత్సరాల వరకు కొనసాగును.

మొదటి 3 సంవత్సరాల వరకు అన్ని రకాల కూరగాయలు, వేరుశనగ, సొయా, ప్రత్తి, పెసర, మినుములు, శనగ, కుసుమ, పసుపు, జొన్నలు, మక్కలు, సజ్జ, ఎర్ర జొన్నలు మొదలగు మెట్ట పంటలను అంతరపంటలుగా వేసుకోవచ్చు అనితెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి లావణ్య, హార్టికల్చర్ అధికారి అర్చన వ్యవసాయ విస్తరణ అధికారి సంధ్య వంశీ వైష్ణవి గజానంద్ అనిల్ సర్పంచ్ తేలు నరేష్ ఉప సర్పంచ్ పోతయ్య రైతులు భూమరెడ్డి రాజేశ్వర్ రెడ్డి నరసయ్య ఆశన్న తదితరులు పాల్గొన్నారు.