నేడు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం వినియోగించుకోవాలి. జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి.
ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్. నవగీతం, ఖమ్మం: పాలేరు ఏదులాపురం మున్సిపాలిటీల పరిధిలో ఓటరుగా నమోదై ఉండి, ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న జిల్లా, ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు (ఫిబ్రవరి 8న) ఆదివారం ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల...