నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివ నామస్మరణ చేస్తూ శివరాత్రి వేడుకలు జరుపుకునే సందర్భంగా..జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డాక్టరేట్ గ్రహీత,గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కళాకారుడు డా.గుర్రం దయాకర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు శివరాత్రి జరుపుకుంటున్న సందర్భంగా ప్రపంచంలో ఎవరూ తయారు చేయని అద్భుతం. పంపకాల సూది పై నాగుపాము పడిగే నీడలో కూర్చుని ఆశీర్వదిస్తున్నట్లు శివయ్య విగ్రహం రూపొందించడం జరిగింది.రూపొందించడానికి వాడిన మెటీరియల్స్ పంపకాల. సూది, నైలాన్, పెన్సిల్ కలర్స్ వాడడం జరిగినది ఇలాంటి అద్భుతమైన విగ్రహాలను తయారు చేయుటకు 10 గంటల సమయం పట్టిందని దయాకర్ తెలిపారు.ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.