పట్టణంలో వరుస దొంగతనాల కేసులు ఛేదింపు

7గురు నిందితుల అరెస్టు – 15 తులాల బంగారం, 32 తులాల వెండి స్వాధీనం సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల పట్టివేత:  ఎస్పీ అశోక్ కుమార్ నవగీతం, మెట్ పల్లి: మెట్‌పల్లి, పరిసర ప్రాంతాల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడిన ఏడుగురు నిందితులను మెట్‌పల్లి పోలీసులు గురువారం అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్  తెలిపారు. నిందితుల నుంచి 15 తులాల బంగారం, 32 తులాల వెండి మరియు ఒక ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. గురువారం మెట్‌పల్లి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన...