పట్టణాభివృద్ధికి పట్టం కట్టండి..ఎమ్మెల్యే విజయరమణ రావు

33 మంది అభ్యర్థుల ప్రకటన నవగీతం,పెద్దపల్లి: ప్రజాభిష్టానికి అనుగుణంగా నిజాయితీగా ప్రజా సేవ చేయడమే తన లక్ష్యమని,గత రెండేళ్లలో కోట్ల రూపాయలతో పెద్దపల్లి పట్టణ రూపురేఖలను మార్చామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పేర్కొన్నారు.ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు గాను 33 వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులను ఆయన అధికారికంగా ప్రకటించారు. అనంతరం రంగంపల్లి 10వ వార్డు మాజీ కౌన్సిలర్ గాదె మాధవి ఎమ్మెల్యే...