పట్టణాల అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటా.. మేడిపల్లి సత్యం
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. నవగీతం,చొప్పదండి: చొప్పదండి పురపాలక సంఘం ఎన్నికలలో భాగంగా 3,6,8,9,10,14 వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులకు మద్దతుగా చొప్పదండి శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం సుడిగాలి ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణాల అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులకు ఓటేసి చొప్పదండి పట్టణాన్ని అభివృద్ధి చేసే అవకాశం కల్పించాలని కోరారు. చొప్పదండి పట్టణంలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి...