పదవ తరగతి, ఇంటర్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి.. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నాణ్యమైన విద్యతో ప్రభుత్వ గురుకులాలకు పెరుగుతున్న ప్రజాదరణ సోషల్ జస్టిస్ డే వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నవగీతం,మధిర: పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవడమే తల్లిదండ్రులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి అని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం మధిర నియోజవర్గం ఎర్రుపాలెం మండలంలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో నిర్వహించిన తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి...