పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

నవగీతం,కొడిమ్యాల: కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామానికి చెందిన పద్మశాలి కుల పెద్దలు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.ఈ సమావేశంలో సంఘ భవిష్యత్తు కార్యాచరణ, కుల సంక్షేమం, సామాజిక సేవా కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించి, అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వడ్లకొండ మురళిని, ఉపాధ్యక్షులుగా సిరిసిల్ల సురేష్‌ను,ప్రధాన కార్యదర్శిగా వీరబాత్తిని గణేష్‌ను, కోశాధికారిగా ఐట్ల గంగాధర్‌ను, ఉప కార్యదర్శిగా పచ్చునురి సుకుమార్‌ను నియమించారు.అలాగే సంఘానికి మార్గదర్శకులుగా వ్యవహరించేందుకు గౌరవ సభ్యులుగా మ్యాకల...