navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 11:16 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అధికారులను సన్మానించిన లయన్స్ క్లబ్ చైర్మన్

నవగీతం, మల్లాపూర్:

ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన మల్లాపూర్ తహసిల్దార్ శ్రీనివాస్ ని గురువారం లయన్స్ క్లబ్ అధ్యక్షులు రేవెల్లి తిరుపతి మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో ఘనంగా సన్మానించారు.

అలాగే మండలంలోని అధికారులు ఎస్సై అనిల్ , వైద్యాధికారిని వాహిని రావును మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. సన్మానించిన వారిలో ముత్యంపేట మాజీ సర్పంచ్ వర్దినేని ప్రభాకర్ రావు, ప్రేమ్ కుమార్, మండ స్వామి ,సింగారపు అశోక్, మాట్లా సోమయ్య తో పాటు లయన్స్  క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.