పెద్దశేష వాహనంపై వైకుంఠ నారాయణుడి దర్శనం
నవగీతం ,హైదరాబాద్: పెద్దశేష వాహనంపై వైకుంఠ నారాయణుడి అలంకారంలో జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి కటాక్షం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు మంగళవారం రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారు పరమపద వైకుంఠ నారాయణుడి అలంకారంలో కటాక్షించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని...