ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన జిల్లా ఉన్నతాధికారులు.
నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా కేంద్రంలో యస్.కె.ఎన్.ఆర్ డిగ్రీ కాలేజ్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి వార్డు ల వారిగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఎన్నికల సామగ్రిని ఎన్నికల సిబ్బంది స్వీకరించి ఆయా పోలింగ్ స్టేషన్ లకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు సిబ్బందికి ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా,బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల కమిషన్మా ర్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. జిల్లాలో గల జగిత్యాల, రాయికల్, ధర్మపురి, కోరుట్ల,మెట్ పల్లి మున్సిపాలిటీ లలో ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు పేర్కొన్నారు.