navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 3:03 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పోస్టల్ బ్యాలెట్ ను ఉద్యోగులు వినియోగించుకోవాలి

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్

నవగీతం,జగిత్యాల ప్రతినిధి :

జిల్లాలోని ఐదు మునిసిపాలిటీలకు సంబంధించి రెండో సాధారణ మునిసిపల్ ఎన్నికలు – 2026 నేపథ్యంలో ఈనెల 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఐదు మున్సిపాలిటీల పరిధిలోని ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. అందుకు ఈనెల 8 ఆదివారం ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు సంబంధిత 5 మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగులు తప్పనిసరిగా తమకు సంబంధించిన డ్యూటీ ఉత్తర్వుల ప్రతిని గుర్తింపు కార్డుతో పాటు వ్యక్తిగతంగా హాజరుకావల్సి ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు