navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 2:21 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రశాంతంగా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లాలో సోమవారం17 జనరల్, ఒకేషనల్ పరీక్ష కేంద్రాల్లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలలో ఉదయం 1409 మంది విద్యార్థులకు గాను 1312 మంది విద్యార్థులు హాజరు కాగా జనరల్ విభాగంలో 808 మంది విద్యార్థులకు గాను 780 మంది విద్యార్థులు, అదేవిధంగా ఒకేషనల్ విభాగంలో 601 మంది విద్యార్థులకు గాను 532 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్న సమయంలో మొత్తం 1119 మంది విద్యార్థులకు 1070 మంది విద్యార్థులు హాజరు కాగా ఇందులో జనరల్ విభాగంలో 603 మంది విద్యార్థులకు గాను 600 మంది, అదేవిధంగా ఒకేషనల్ విభాగంలో 516 మంది విద్యార్థులకు గాను 470 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇదేవిధంగా ప్రతిరోజు ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్షలు నిర్వహించాలని సంబంధిత పరీక్ష సెంటర్ల సూపరింటెండెంట్ లకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బి.నారాయణ ఆదేశించారు.