ప్రాణాలు పోయాయి… భరోసా ఎక్కడ.. ?
పలకరింపు కూడా దొరకలేదా.. ? నవగీతం, మల్లాపూర్: మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో ఈ నెల 3వ తేదీన జరిగిన భయానక ట్రాక్టర్ ప్రమాదంతో విషాదంలో మునిగిపోయింది. కూలి పనుల కోసం బయలుదేరిన అమాయకుల ప్రాణాలు క్షణాల్లో ఆగిపోవడంతో గ్రామం మొత్తం శోకసంద్రంగా మారింది కానీ ప్రభుత్వ భరోసా తో పాటు కనీసం నాయకుల పలకరింపు కూడా కరువైంది. ఈ ప్రమాదంలో 6వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక వైష్ణవితో పాటు మరో ముగ్గురు నిరుపేద మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోవడం గ్రామస్తుల...