ఫిబ్రవరి 15ను అధికారిక సెలవుగా ప్రకటించాలి

టీజీయూఎస్ జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు నవగీతం, జగిత్యాల ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో బంజారా సమాజం ఆరాధ్య దైవం, సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15న రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, ప్రధాన కార్యదర్శి జరుపుల గోవింద్ లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది లంబాడి బంజారా ప్రజలకు ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా, సంస్కృతి పరిరక్షకుడిగా, ధర్మరక్షకుడిగా సద్గురు...