ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
- జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి : ప్రజావాణి అర్జీలపై సమగ్ర విచారణ జరిపి వాటిని త్వరగా పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్, ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు...