స్థానిక గట్టు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
భైంసా పట్టణంలోని కిసాన్ గల్లీకి చెందిన బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ కాసరోల్ల ప్రవీణ్ చేపట్టిన పాదయాత్ర భక్తి వాతావరణంలో ప్రారంభమైంది.భైంసా మున్సిపాలిటి లో కాషాయ జెండా ఎగిరితే కొండగట్టులోని అంజన్న స్వామిని దర్శించుకుంటానని మొక్కుకున్నట్లు ప్రవీణ్ తెలిపారు. ఆ మొక్కు నెరవేర్చుకునే క్రమంలో పాదయాత్రగా కొండగట్టు పవిత్రక్షేత్రం వైపు బయలుదేరారు. మంగళవారం కొడిమ్యాల గట్టు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక చైర్మన్ బిజెపి తుమ్మల దత్తాత్రి బిజెపి కౌన్సిలర్ దిలీప్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రవీణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మార్గమధ్యంలోని గ్రామాల్లో నాయకులు, గ్రామస్తులు ప్రవీణ్‌కు ఘన స్వాగతం పలుకుతున్నారు. పండ్లు, తాగునీరు అందిస్తూ, రాత్రివేళ విశ్రాంతికి వసతి కల్పిస్తూ తమ ఆదరణను వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్ర నాలుగో రోజుకు చేరుకున్న సందర్భంగా ప్రస్తుతం ఆయన జగిత్యాల జిల్లా దాటి రాజారాం ప్రాంతానికి చేరుకున్నట్లు తెలిపారు. ఈ రాత్రి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం చేరుకుంటాననే విశ్వాసం వ్యక్తం చేశారు.భైంసా మున్సిపాలిటీ బీజేపీ ఖాతాలో చేరడం అంజన్న ఆశీస్సుల వల్లే సాధ్యమైంది. అందుకే మొక్కు తీర్చుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నాను అని ప్రవీణ్ పేర్కొన్నారు.