బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.
శాస్త్రోక్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. నవగీతం, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణం సందర్భంగా సాయంత్రం 6 :30 నుండి రాత్రి 8 :30 వరకు పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు మంగళవారం ధ్వజారోహణంతో శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.00 గంటల మధ్య...