navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 February 2026, 8:50 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

భక్తులమర్రి దేవాలయంలో డాక్టర్ హేమారెడ్డి విశేష పూజలు

నవగీతం,జగిత్యాల ప్రతినిధి :

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో గల భక్తులమర్రి దేవాలయంలో నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ హేమారెడ్డి, డాక్టర్ మాధురి గార్లు విశేష పూజలు నిర్వహించారు. నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా ముందుగా ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బడుగు భూమేష్, జోగినపల్లి సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, వార్డు మెంబర్ ఆకువత్తిని నిరంజన్, నాయకులు ప్రదీప్ రావు తదితరులు పాల్గొన్నారు.