భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు.

పండుగ వాతావరణంలో రథోత్సవ మహోత్సవం. నవగీతం, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ర‌థాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.ఉదయం 7.45 గం.లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి రథోత్సవ మహోత్సవం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య స్వామివారి రథం నాలుగు మాడ వీధులలో మహా వైభవంగా రథయాత్ర సాగింది. కర్పూరహారతులు సమర్పించి, గోవిందా గోవిందా అంటూ భక్తులు...