నవగీతం,ఇబ్రహీంపట్నం:
అందరూ భీమా చేసుకోవడం వల్ల కుటుంబానికి ధీమాగా ఉంటుందని ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ సర్పంచ్ వెంకట్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో సోమవారం అందరికీ బీమా మన గ్రామానికి ధీమా అనే కార్యక్రమాన్ని సర్పంచ్ పోనకంటి వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకట్ మాట్లాడుతు ఆకస్మాత్తుగా జరిగే ప్రమాదాల దృష్ట్యా కుటుంబాలకు పి ఎం ఎస్ బి వై భీమా ఆశారాగా నిలుస్తుందని తెలిపారు.గ్రామంలోని ప్రతి ఒక్కరికి కూడా గ్రామ పంచాయతీ నుంచి భీమాకు సంబంధించిన డబ్బులను చెల్లిస్తామని అన్నారు. ఉపాధి హామీ, ఒడ్డెర కులనికి చెందిన కార్మికులకు లేబర్ కార్డులు వచ్చే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ భీమా ధ్వారా మరణించిన వ్యక్తి యొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయలు వస్తాయన్నారు. అలాగే లేబర్ కార్డు ధ్వారా వచ్చే లబ్దిని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్,ఉపసర్పంచ్ తుమ్మల జయ,పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, వార్డు సభ్యులు, యూనియన్, సహకార బ్యాంకు మేనేజర్లు, గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.